కల్కి 2 గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో దీపికా పదుకోణ్ ఉంటారా లేదా అన్న ప్రశ్నపై అభిమానుల్లో ఆసక్తి ఎక్కువైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడిలో ప్రభాస్ సరసన ఆమెకు ఇచ్చిన పాత్ర ఎంతో స్పెషల్ గా నిలిచింది. దీంతో రెండో భాగంలో కూడా ఆమె తప్పకుండా ఉంటారని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.
కానీ తాజాగా మేకర్స్ చేసిన ఒక అప్రత్యాశిత ప్రకటన మాత్రం అందరినీ కన్‌ఫ్యూజ్ చేసింది. ఈ అప్డేట్ బయటకు రాగానే దీపికా పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇదే సమయంలో దీపికా పేరు గతంలో ప్రభాస్ మరో ప్రాజెక్ట్ “స్పిరిట్” కి కూడా అనుకున్నారు. కానీ అక్కడ చివరికి ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రి ఫైనల్ అయ్యారు. ఇప్పుడు కల్కి 2 విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుందా అన్న డౌట్స్ రేకెత్తుతున్నాయి.
అదే సమయంలో వైజయంతి మూవీస్ తమ ప్రాజెక్ట్ లో కమిట్మెంట్, డెడికేషన్ విషయంలో ఎలాంటి తగ్గింపు ఉండదని స్పష్టంగా చెబుతూ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు దీపికానే ట్రబుల్ క్రియేట్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
