శర్వానంద్‌ మనమే టీజర్‌ వచ్చేసింది!

Tuesday, January 21, 2025

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శర్వానంద్‌ వరుస సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌ లేకపోవడంతో కొంచెం సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏకంగా ఒకేసారి మూడు నాలుగు సినిమాలను చేతిలో ఉంచుకుని గ్యాప్‌ లేకుండా షూటింగ్‌ లు చేస్తున్నాడు.

అందులో ఒక సినిమా మనమే.. సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా చిత్ర బృందం టీజర్ ను విడుదల చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శర్వా 35 వ సినిమాగా మనమే సినిమా రాబోతుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా చేస్తుంది.

 ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ఆ  సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా  చిత్ర బృందం సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు.. టీజర్ ను చూస్తుంటే సినిమాను లండన్ బ్యాక్ డ్రాప్ లో  రూపుదిద్దుకున్నట్లు తెలుస్తుంది.

సినిమా లండన్, యూరప్ లోనే జరుగుతుందని తెలుస్తుంది. అనుకోకుండా హీరో, హీరోయిన్ లైఫ్ లోకి ఒక పిల్లాడు  వస్తే ఏం జరుగుతుంది? అసలు ఆ పిల్లాడికి హీరోకు ఏదైన సంబంధం ఉందా? బాబు ప్లాష్ బ్యాక్ ఏంటి అనే దాని పై సినిమా కథ ఉండబోతుందని టీజర్‌ చూస్తే అర్థం అవుతుంది.  ఈ సినిమాలో హీరో లుక్ స్టైలిష్ గా ఉంది.. ఈ సినిమాను  సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles