టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ కూడా ఒకరు. మరి తాను హీరోగా దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్ లో ఓ సాలిడ్ మాస్ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ క్రేజీ అప్డేట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. దీంతో ఒక ఆసక్తికర గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేస్తూ శర్వానంద్ నుంచి కంప్లీట్ మాస్ షేడ్ ను ప్రెజెంట్ చేసారని చెప్పాలి. అలాగే దర్శకుడు సంపత్ నంది చూపించిన మాస్ కట్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయని తెలుస్తుంది.
ఇక వీటితో పాటుగా ఈ చిత్రానికి “భోగి” అనే టైటిల్ ని మేకర్స్ ప్రకటించారు. నేటి నుంచే షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ సినిమా విడుదలని మేకర్స్ పాన్ ఇండియా భాషల్లో విడుదల చేస్తున్నట్లుగా తేల్చి చెప్పారు. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతిలు హీరోయిన్స్ గా నటిస్తుండగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది.
