విడుదలకు రెడీ అవుతున్న షణ్ముఖ

Sunday, December 22, 2024

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఇటీవల చేసిన సినిమాలు చూస్తే ప్రతిదానిలో ఏదొక కొత్త ప్రయత్నం కచ్చితంగా కనిపిస్తుంది. అయితే వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నప్పటికీ మంచి హిట్ కోసం తాను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. మరి ఇలా తాను హీరోగా యంగ్ హీరోయిన్ అవికా గోర్ హీరోయిన్ గా డైరెక్టర్‌ షణ్ముగ సప్పని తెరకెక్కిస్తున్న భారీ సినిమానే “షణ్ముఖ”.

మరి భారీ గ్రాఫికల్ వర్క్ తోనే స్టార్ట్ చేసి ఇప్పుడు ముగింపుకి తీసుకొస్తున్న ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేయ్యాలో ఇప్పుడు మేకర్స్ ఫిక్స్ చేసేసారు. మరి ఈ సినిమాని మూవీ మేకర్స్‌ ఈ దీపావళి కానుకగా థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రం దాదాపు 40 శాతం సీజీఐ తోనే కనిపిస్తుంది అని అలాగే కేజీయఫ్, సలార్ సంగీత దర్శకుడు రవి బాస్రుర్ ఇచ్చిన స్కోర్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది అని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

అలాగే ఈ సినిమా దీపావళి విడుదల కి పర్ఫెక్ట్ గా ఉంటుంది అని అందుకే అప్పటికి ప్లాన్ చేసినట్టు మూవీ మేకర్స్‌ తెలుపుతున్నారు. మరి ఈ సినిమా విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles