గేమ్‌ ఛేంజర్‌ సినిమాకి శంకర్‌ ప్రత్యేకమైన శ్రద్ద!

Tuesday, January 21, 2025

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలివుడ్‌ స్టార్‌ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నమోస్ట్‌ అవైటెడ్ చిత్రమే “గేమ్ ఛేంజర్”. మరి ఈ మూవీని ఎప్పుడు నుంచో తెరకెక్కిస్తుండగా ఇప్పటికి సినిమా చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ సన్నివేశాలు ఎప్పుడో పూర్తి చేసేయగా మిగతా సన్నివేశాలు రెండు వారాలు అలా బ్యాలన్స్ ఉంటాయి.

అయితే అసలు ఈ సినిమా విషయంలో శంకర్ ఏ రేంజ్ డెడికేషన్ చూపించారో మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పిన కామెంట్లు వైరల్ గా మారాయి. తాను సినిమా సెట్స్ లోకి వెళ్ళింది చాలా తక్కువే కానీ డైలాగ్స్ విషయంలో మాత్రం సినిమా కోసం శంకర్ గారితో మాట్లాడినప్పుడు ఈ సినిమా డెఫినెట్ గా చరణ్ కెరీర్ లో నిలిచిపోయే మరో సినిమాల ఉంటుందని అన్నారు.

అలాగే ఈ సినిమా పూర్తి ప్యాకేజీ శంకర్ మార్క్ లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని ఆయన వివరించారు. ఇక అంతే కాకుండా శంకర్ గారికి తెలుగు వారు అంటే ఎంతో గౌరవం అని అందుకే ఈ సినిమాలో ఏ చిన్న మిస్టేక్ లేకుండా డైలాగ్స్ ని అద్భుతంగా రాబట్టారని తెలిపారు. మొత్తానికి అయితే గేమ్ ఛేంజర్ విషయంలో శంకర్ చాలానే డెడికేషన్ ని చూపించారని చెప్పుకొవచ్చు. మరి ఈ సినిమా భారీ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles