“ఇండియన్ 3” పై శంకర్ ఆసక్తికర కామెంట్లు!

Monday, December 8, 2025

పాన్‌ ఇండియా లెవల్‌ డైరెక్టర్లలో శంకర్‌ అంటే తెలియని వారు ఉండరు. తనదైన భారీ సినిమాలు, మెసేజ్ లతో శంకర్ ఎన్నో మరపురాని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అయితే ఇపుడు తన సినిమాలు అనుకున్న రేంజ్ లో హిట్లు అందుకోవడం లేదు. రీసెంట్ గానే వచ్చిన సినిమా “గేమ్ ఛేంజర్” కూడా చాలా నెగిటివిటీ చూసింది.

అయితే ఈ సినిమా తర్వాత శంకర్ నుంచి ఉన్న మరో సినిమా ఏదైనా ఉంది అంటే అది “ఇండియన్ 3” నే. ఇది కూడా పార్ట్ 2 సక్సెస్ కాలేదు కానీ పార్ట్ 3 ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారు. అయితే దీనిపై శంకర్ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.

తన నెక్స్ట్ పని ఇండియన్ 3కి చేయాల్సి ఉందని… ఆ సినిమా షూటింగ్ దాదాపు అయిపోయింది, మేజర్ గా వీఎఫ్ఎక్స్ పనులు మాత్రమే పెండింగ్‌ లో ఉన్నాయని తెలిపారు. అలాగే ఇదంతా అయ్యేసరికి మరో 6 నెలల సమయం పడుతుందని ఆ తర్వాత థియేటర్స్ లో విడుదలకి తీసుకొస్తామని శంకర్ ఓ క్లారిటీ ఇచ్చారు. దీంతో తన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles