గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, అంజలి, కియార అద్వానీ హీరోయిన్లుగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “గేమ్ ఛేంజర్” అయితే ఈ సినిమా గురించి అభిమానులు ముందు నుంచి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. మరి శంకర్ నుంచి తొలి తెలుగు సినిమా ఇది కావడంతో శంకర్ కూడా తన శైలిలో తీర్చిదిద్దాడు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి కథ మాత్రం తనది కాదు.
మొదటిసారి తన కథ కాకుండా మరో దర్శకుడు కథతో తను సినిమా చేసినట్లు తెలుస్తుంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా బాగున్నప్పటికీ సోషల్ మీడియాలో భారీ ఎత్తున నెగిటివ్ టాక్ నడిచింది. తాజాగా డైరెక్టర్ శంకర్ చేసిన పలు కామెంట్స్ ఇపుడు షాకింగ్ గా మారాయి.
నిజానికి గేమ్ ఛేంజర్ కి భారీ రన్ టైం తో కూడిన ఫుటేజ్ వచ్చింది అని చాలా సాలిడ్ సీన్స్ ని తాము నిడివి కోసం కట్ చేసేసామని ఈ విషయంలో తను కొంచెం డిజప్పాయింట్ గా ఉన్నానని చెప్పుకొచ్చాడు.దీంతో ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. విడుదల తర్వాత ఇలా ఒకొక్కటిగా బయటకు వస్తుండడంతో మెగా అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారు.