వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే యువ కథానాయకుడు ఆది సాయికుమార్ మరో ఆసక్తికర మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యుగంధర్ ముని డైరెక్షన్ లో ఆయన నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల. అర్చన అయ్యర్ కథానాయిక.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఆది పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో ఆది పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని, ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని చిత్ర బృందం చెబుతుంది.
కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ప్రేక్షకులు థ్రిల్ అవుతారని మూవీ టీమ్ చెప్పింది. శంబాలలో ఆది సాయి కుమార్ జియోసైంటిస్ట్ గా కనిపించనున్నారు. శ్వాసిక, రవివర్మ ,మీసాల లక్ష్మణ్ మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని సరికొత్త పాయింట్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్‌మద్దూరి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.