బాయ్ ఫ్రెండ్‌ తో కనిపించిన షారూక్‌ కుమార్తె!

Saturday, March 29, 2025

అమెరికాలోని యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొందిన సుహానా ఖాన్ నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్షన్ ఆర్కిలెస్‌లో నటించి మెప్పించింది.  తర్వాత తండ్రి షారూఖ్‌తో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  షారుఖ్ ఖాన్ ఇండియన్ సినిమాలో టాప్ యాక్టర్ గా వెలుగొందుతున్నారు. గతేడాది ఆయన నటించిన జవాన్, భట్టం, డుంకీ చిత్రాలు ఘన విజయాలు అందుకున్నాయి.

షారూక్‌ కుమార్తె సుహానా ఖాన్ తదుపరి చిత్రం ‘ది కింగ్’లో షారుఖ్ ఖాన్ సరసన గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనుంది. ఈ చిత్రంలో సుహానా ఖాన్‌ మెయిన్‌ లీడ్‌ పోషిస్తుంది. షారుఖ్ ఖాన్ తన కూతురు కోసం 200 కోట్లతో భారీ ఎత్తున ఈ సినిమాని రూపొందించేందుకు రెడీ అయ్యాడు.

ఈ క్రమంలో సుహానా తాజాగా లండన్‌లో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందాతో  డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచూ రహస్యంగా సమావేశమవుతున్నారని..చాలా కాలం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని..అందుకు సంబంధించిన  కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

సుహానా, అగస్త్య చాలా కాలం నుంచి డేటింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే వీరి ప్రేమ గురించి మాత్రం ఇప్పటి వరకు ఇరువురిలో ఒక్కరు కూడా బయటకు చెప్పలేదు. ఎక్కడ దీని గురించి మాట్లాడలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles