హీరో అడివి శేష్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా డెకాయిట్ మీద ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని షనీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా, దీన్ని క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ముందుగా చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమా షూటింగ్ అనుకున్న వేగంలో సాగకపోవడం వల్ల షెడ్యూల్ ఆలస్యమైందని సమాచారం. ముఖ్యంగా అడివి శేష్ ఇటీవల కాలికి గాయం కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని, దీంతో ఆయన షూటింగ్‌లో పాల్గొనడం కొంతకాలం వాయిదా పడిందని తెలుస్తోంది. సినిమాలో ఒక పెద్ద యాక్షన్ సీన్ చిత్రీకరణ ఇంకా మిగిలి ఉండటంతో, షూటింగ్ పూర్తయ్యే సమయానికి క్రిస్మస్ రిలీజ్ సాధ్యం కాదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కారణంగా డెకాయిట్ విడుదల తేదీ మారే అవకాశం ఉందని, దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
