సెన్సేషనల్ బిజినెస్

Sunday, April 13, 2025

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. రీసెంట్ గానే వచ్చిన టైటిల్ టీజర్ తో ఓ రేంజ్ లో హైప్ ని ఈ సినిమా సొంతం చేసుకోగా ఈ చిత్రంతో విజయ్ మాస్ కం బ్యాక్ కొడతాడు అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి ముందు విజయ్ నుంచి రెండు ప్లాప్స్ పడినప్పటికీ సాలిడ్ బిజినెస్ జరుగుతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.

ఇలా కింగ్డమ్ సినిమాకి యూఎస్ మార్కెట్ లో తన గత సినిమా ది ఫ్యామిలీ స్టార్ కి మించి బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. మరి ఇలా కింగ్డమ్ కి ఏకంగా 2 మిలియన్ కి పైగానే అక్కడ బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా పట్ల ఉన్న హైప్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles