అదిరే లుక్స్‌ లో సీనియర్‌ స్టార్‌ హీరోలు!

Saturday, November 23, 2024

మన టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మెగాస్టార్ చిరంజీవి అలాగే అక్కినేని నాగార్జునలు రిల్‌ లైఫ్‌ లోనే కాకుండా …రియల్‌ లైఫ్‌ లో కూడా ఎంతో మంచి స్నేహితులు. ప్రస్తుతం వారిద్దరూ తమ తమ భారీ సినిమాల్లో బిజీగా నటిస్తున్నారు. తాజాగా దివంగత  నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డ్స్ వేడుకని కింగ్ నాగ్ అట్టహాసంగా చేసేందుకు సిద్ధం అయ్యారు.

మరి ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవిని కూడా ముఖ్య అతిధిగా పిలుస్తాను అని ముందే చెప్పారు. మరి అన్నట్లుగానే నేడు చిరంజీవిని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. అయితే ఈ కలయికపై కొన్ని పిక్స్ అయితే క్రేజీగా మారాయి. ఇద్దరికిద్దరు కూడా ఒక ఊహించని స్టైలిష్ లుక్‌ లో అదరగొట్టేసారు.

కింగ్ నాగ్ ఎప్పటిలానే మంచి స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తుండగా తనతో పాటుగా స్టైలిష్ టీ షర్ట్ అండ్ జీన్స్ కాస్ట్యూమ్ లో చిరు కనిపించి ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించారు. ఇలా ఇద్దరు కూడా కిల్లింగ్ లుక్స్ తో దర్శనం ఇచ్చి ఫ్యాన్స్ కి నేడు ఊహించని ట్రీట్ ని అందించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles