నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ S/O వైజయంతి’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ సినిమాను ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా, ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. తల్లికొడుకుల అనుబంధాన్ని ఈ పాటలో మనకు చక్కగా ప్రజెంట్ చేయబోతున్నారు. ‘ముచ్చటగా బంధాలే’ అంటూ సాగే ఈ ఎమోషనల్ సాంగ్‌ను ఏప్రిల్ 9న సాయంత్రం 6.09 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
