తాత వస్తాడే అదరగొట్టి పోతాడే అంటూ..ఇండియన్‌ 2 నుంచి..!

Sunday, December 22, 2024

లోక నాయకుడు కమ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న తాజా సినిమా ‘భార‌తీయుడు-2’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్ గా ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కిస్తుండ‌గా.., 1996 కల్ట్ క్లాసిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘భార‌తీయుడు’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన ఆడియో లాంచ్ ఇటీవ‌ల చెన్నైలో గ్రాండ్ గా నిర్వ‌హించచిన సంగతి తెలిసిందే.ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి ‘తాత వ‌స్తాడే.. అదరగొట్టి పోతాడే..’ అనే పాట లిరిక్ వీడియోను మేక‌ర్స్ విడుదల చేసారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ తో ఈ సినిమాను మరో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లనున్న‌ట్లు అర్థ‌మవుతోంది. ఈ లిరికల్‌ వీడియో సాంగ్‌ లో హీరో సిద్ధార్థ్‌, ప్రియా భవానీ తమ డ్యాన్స్‌ తో ప్రేక్షకులను అలరించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles