బాలీవుడ్‌లో ఇటీవల మంచి చర్చలు తెచ్చుకున్న సినిమా “సైయారా”. ఈ చిత్రంతో ఆహాన్ పాండే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అనీత్ పద్దా హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమాని దర్శకుడు సూరి తెరకెక్కించాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా విడుదలైన వెంటనే ఊహించని రేంజ్‌లో సక్సెస్ అందుకుంది. డెబ్యూ హీరోగా ఇంత పెద్ద వసూళ్లు సాధించడం ఇండియన్ సినిమా దగ్గర అరుదైన విషయమని చెప్పాలి.
థియేటర్స్‌లో రికార్డులు సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ తీసుకోగా, నేటి నుంచి అక్కడ అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్‌లోనే స్ట్రీమ్ అవుతోంది. కాబట్టి హిందీ అర్థం చేసుకోగలిగిన వారు లేదా ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడగలిగిన వారు ఇప్పుడు ఈ సినిమాని ఆనందించవచ్చు.
