“తండేల్” లోని సత్య రోల్ మరో మరపురాని పాత్ర!

Tuesday, January 21, 2025

టాలీవుడ్ హీరో, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో, దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ తండేల్. ఈ కథ అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి, భారతదేశానికి తిరిగి రావడానికి ముందు దాదాపు రెండేళ్ల జైలు జీవితం గడిపిన రాజు నిజ జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో రౌడీ బేబీ, హైబ్రిడ్‌ పిల్ల సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి తాజాగా రెండు అవార్డులను గెలుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సందర్భం గా తండేల్ చిత్ర యూనిట్ ఈ హ్యాపీ మూమెంట్ ను సెలబ్రేట్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మూవీ యూనిట్‌. ఈ చిత్రంలోని సత్య పాత్ర కూడ మరో మరపురాని పాత్ర అవుతుంది అని చిత్ర బృందం చెప్పుకొచ్చారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకులుగా ఉన్నారు. డిసెంబర్ 20, 2024న విడుదల థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles