‘సరిపోదా’ నాని, వివేక్ ఆత్రేయల మాస్ ఎంటర్‌టైనర్‌!

Tuesday, January 21, 2025

నేచురల్ స్టార్ నాని ఇపుడు డిఫరెంట్ సబ్జెక్టు లతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒక్కో సినిమాకి వ్యత్యాసం చూపిస్తూ సినిమా సినిమాకి డిఫరెంట్ లుక్స్ ని కూడా ప్రెజెంట్ చేస్తూ వరుస హిట్స్ తో వెళ్తున్న నాని ఇపుడు చేస్తున్న సినిమానే సాలిడ్ మూవీనే “సరిపోదా శనివారం”. దర్శకుడు వివేక్ ఆత్రేయతో ప్లాన్ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ మాత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో బజ్ ని క్రియేట్‌ చేసుకుంది.

లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ చూస్తే మాత్రం ఈసారి నాని, వివేక్ ఆత్రేయల మాస్ ప్రంభజనం తప్పనిసరి  అనేలా ఉంది. అయితే వీరి కాంబోలో వచ్చిన లాస్ట్ చిత్రం అది కూడా క్లాస్ చిత్రం “అంటే సుందరానికీ” ఒక్క యూఎస్ మార్కెట్ మినహా తెలుగు స్టేట్స్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫామ్ చేయలేదు. కానీ నెమ్మదిగా ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఆ క్లాస్ సినిమాతో కొట్టని హిట్ ని అయితే ఈసారి మాస్ సినిమాగా వడ్డీతో సహా ఇచ్చేలా ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది.. ఇప్పుడు వరకు వచ్చిన కంటెంట్ అంతా కూడా అదరగొట్టగా తాజాగా విడుదలైన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇలా మొత్తంగా మాత్రం ఇద్దరూ మాస్ సంభవమే చూపించేలా ఉన్నారని చెప్పాలి. మరి అది తేలాలి అంటే ఈ ఆగస్ట్ 29 వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles