నేచురల్ స్టార్ నాని హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ లలో క్రేజీ యాక్షన్ కం క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 3” కూడా ఒకటి. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుండగా ఈ దర్శకుడు మరింత స్థాయిలో పెద్ద ఫ్రాంచైజ్ గా విస్తరిస్తానని ఇది వరకే కన్ఫర్మ్ చేసాడు.
ఇలా పాన్ ఇండియా లెవెల్ హీరోస్ కూడా ఈ ఫ్రాంచైజ్ లో చేరుతారని తాను చెప్పగా ఇపుడు ఇదే కోవలో తమిళ హీరో కార్తీ కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఆల్రెడీ మంచి హాట్ టాపిక్ గా మారిన ఈ సినిమాపై ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది.
దీనితో కార్తీ ఆల్రెడీ తన క్యామియో షూట్ ని కూడా కంప్లీట్ చేసుకున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. దీనితో క్లైమాక్స్ లో హిట్ 2 కి నాని వచ్చినట్టుగా కార్తీ హిట్ 3 క్లైమాక్స్ లో హిట్ 4 కి లీడ్ ఇచ్చేలా వస్తాడని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ మే 1న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. అలాగే కార్తీ కూడా సర్దార్ 2 తో రాబోతున్న సంగతి తెలిసిందే.