సంక్రాంతి బరిలోనే!

Saturday, January 18, 2025

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా విశ్వంభర. ఈ సినిమాని బింబిసార ఫేమ్‌ డైరెక్టర్‌ వశిష్ఠ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ లో యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా స్టార్ హీరోయిన్‌ త్రిష, ఆషిక రంగనాథ్ యాక్ట్‌ చేస్తున్నారు. దర్శకుడు వశిష్ఠ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను ప్రారంభించాడు.

ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించారు. అందుకే షూటింగ్‌ పనులను చకచక కానీస్తున్నారు. విశ్వంభర చిత్రాన్ని దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా వెయిట్‌ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ అలాగే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్నీ ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమాపై ఇపుడు తాజా అప్డేట్ ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సినిమాలో రెండు పాటలు షూటింగ్ మినహా అంతా పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. ఇవి కూడా అతి త్వరలోనే పూర్తి చేసి ఈ జనవరి బరిలోనే సినిమాని దింపే సన్నాహాలు మూవీమేకర్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు టాక్‌ వినిపించింది.

హడావుడిగా ఈ పనులు పూర్తిచేసి సినిమాను విడుదల చేయడం ఇష్టం లేని డైరెక్టర్ వశిష్ఠ చిత్రాన్ని సంక్రాంతి బరి నుంచి తప్పుకోవాలనే ప్రపోజల్‌ను హీరో చిరంజీవి, నిర్మాత ముందు పెట్టారంట. అయితే చిరంజీవి మాత్రం రాత్రి పగలు కష్టపడి సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేయాలని అన్నారంట. సినిమాలకు అత్యంత కీలకంగా భావించే సంక్రాంతి సీజన్‌ను మిస్‌ కాకుండా చూసుకోవాలని చెప్పినట్లు సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles