సందీప్ రెడ్డి ఆన్‌ డ్యూటీ!

Wednesday, January 22, 2025

టాలీవుడ్‌లో ది మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించనున్న ‘స్పిరిట్’ సినిమా  కూడా ఒకటి. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయనుండటంతో ఈ సినిమా యూత్‌ లో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే, ఈ సినిమా ప్రకటించిన తరువాత ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘స్పిరిట్’ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టినట్లు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తన సోషల్ మీడియాలో చెప్పారు.

అయితే ఈ వీడియోలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నాడు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles