ప్రియదర్శితో జత కడుతున్న సమంత!

Saturday, January 18, 2025

స్టార్ బ్యూటీ సమంత గురించి ఏ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మయోసైటిస్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంటున్న
ఈ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం సెలెక్టివ్ గా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తుంది.తాజాగా ఆమె నటిస్తున్న ‘‘సిటాడెల్: హనీ బన్నీ’’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్దంగా ఉంది.

ఇదిలా ఉండగా, ఆమె సెలెక్టివ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఆమె చివరి చిత్రం విజయ్ దేవరకొండతో తీసిన ఖుషి మూవీ. ఇది బాక్సాఫీసు వద్ద యావరేజ్ గా నిలిచింది. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాల మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తనే లీడ్ క్యారెక్టర్ లో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను తాజాగా సమంత ప్రకటించింది. తాజాగా మరో సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. అయితే, ఈ సినిమాలో ఆమె టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శితో రొమాన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రియదర్శితో సమంత జోడీ కట్టనుందన్న వార్త ప్రస్తుతం అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచేసింది. ఇక సమంత పలు చిన్న సినిమాలను తన సొంత బ్యానర్‌పై నిర్మించేందుకు రెడీ అవుతుంది. మరి ప్రియదర్శి-సమంత కాంబోలో నిజంగానే సినిమా వస్తుందా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే మరి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles