ఆసుపత్రి బెడ్‌ మీద సమంత..ఎందుకంటే!

Sunday, December 22, 2024

నటి సమంతా రూత్ ప్రభు 2022లో తనకు “ఆటో ఇమ్యూన్” సమస్య ఉందని, “మయోసైటిస్”తో బాధపడుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది మానసికంగా, శారీరకంగా తన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినప్పటి నుండి, సామ్ తన ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌లను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటునే ఉంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా తన చర్మ సంరక్షణ గురించి కొన్ని విచారకరమైన విషయాలు సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ మధ్యకాలంలో తన చర్మం బాగా మెరుగుపడిందని, గతంలోలా మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదని సమంత చెప్పుకొచ్చింది. తనకు అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడానికి కొన్ని స్ట్రాంగ్ డ్రగ్స్ తీసుకోవాల్సి వచ్చిందని సమంత చెప్పింది. అయితే, డ్రైనెస్, ఇన్ఫ్లమేషన్ సహా ఇతర సమస్యలను సృష్టించి మందులు తన చర్మంపై ప్రభావం చూపాయని సామ్‌ చెప్పుకొచ్చింది.

తన చర్మంపై జనం తరచూ కామెంట్ చేసేవారని కూడా సమంతీ సందర్భంగా  గుర్తుచేసుకుంది. సమంత తన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వరుస చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. తాను పికో లేజర్, రెడ్ లైట్ థెరపీ, శోషరస పారుదలపై దృష్టి సారించే ఫేషియల్స్ చేస్తున్నానని, ఇవి చర్మ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడ్డాయని సామ్‌ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles