సమంత కుక్కలా పుట్టినా పర్లేదంటున్న నాగచైతన్య ఫియాన్సి!

Thursday, March 13, 2025

అక్కినేని యువవారసుడు నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన తరువాత నుంచి కూడా శోభిత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె అడపాదడపా సినిమాలు చేసిందే తప్ప పెద్దగా పాపులర్‌ కాలేదు. కానీ ఆ సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్‌ కంటే ..ఎంగేజ్‌మెంట్‌ అయిన తరువాత వచ్చిన క్రేజ్‌ ఎక్కువ అయ్యింది.

శోభితతో నాగ చైతన్య గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నట్లు రుమార్లు షికారు చేశాయి. అయితే వారే స్వయంగా గత వారం నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. వీరి వివాహ నిశ్చితార్థానికి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. వీరి ప్రేమ వివాహానికి అభినందనలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు  శోభిత పాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు ఒక్కొక్కటిగా వైరల్ గా మారుతున్నాయి.

గతంలో ఆమె తన సోదరి సమంతను గురించి చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నా తల్లితండ్రుల పట్ల నాకున్న ప్రేమను తెలియజేసేందుకు ఎన్ని జన్మలెత్తినా.. మా నాన్న, అమ్మే నాకు తల్లిదండ్రులు కావాలని నా కోరిక. నాకు ఇంకేమీ అవసరం లేదు. నా సోదరి సమంత కుక్కలా పుట్టినా ఫర్వాలేదు’’ అని ఒక పోస్ట్ పెట్టింది. ఇది చూసిన నెటిజన్లు సమంతను కుక్కలా పుట్టమని చెప్పిందంటూ కామెంట్ చేస్తున్నారు.  శోభితకు సమంత అనే సోదరి ఉంది. సమంతకి ఇప్పటికే పెళ్లి అయింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles