మార్షల్​ ఆర్ట్స్​ నేర్చుకుంటున్న స‌మంత..ఎందుకో తెలుసా!

Tuesday, January 21, 2025

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అనారోగ్యం కారణంగా గ‌త కొంతకాలం నుంచి నటనకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. సామ్‌ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్… చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. ఎంజాయ్‌ చేస్తుంది. అయితే తాజాగా  మ‌ళ్లీ తాను సినిమాల‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఓ ఇంట‌ర్వ్యూలో సమంత తెలిపింది.

ఈ క్రమంలో స‌మంత మాట్లాడుతూ.. వ‌చ్చే ఏడాది నుంచి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాను. ఆ సమయం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అందులోని పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నానని వివరించింది. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్, హార్స్‌ రైడింగ్‌, అర్చరీ వంటివి నేర్చుకుంటున్నా. నాకు కూడా త్వ‌రగా సెట్ అవ్వాల‌ని ఉంది. నేను ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఈ 15 ఏళ్ల‌లో చాలా ఒడిదుడుకులు అనుభ‌వించాను. ముఖ్యంగా కింద‌ప‌డి పైకి లేచాను. అయితే మ‌ళ్లీ నేను కొత్త‌గా రెడీ అవుతున్నా. ఒక స్టూడెంట్‌లా మ‌ళ్లీ కెమెరా ముందుకు రావాలి అనుకుంటున్నా అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles