పెళ్లి గౌన్‌ ని రీ మోడలింగ్ చేయించిన సామ్‌!

Sunday, December 22, 2024

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ సమంత గురించి ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌ గా ఎదిగి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ రేంజ్ స్టార్డం ను అందుకుంది.. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సామ్ అక్కడ కూడా తన హవాను కొనసాగిస్తుంది.

ఇక సామ్‌ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ  తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .తాజాగా ఆమె చేసిన ఓ పనికి ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతున్నారు. తన పెళ్లినాటి గౌనును రీమోడలింగ్ చేయించింది. ఆ గౌనును ఓ అవార్డు వేడుక కు వేసుకుని అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే, పెళ్లైన నాలుగేళ్లకే వీరు విడిపోయారు. ఇక అప్పుడు వీరి వివాహం హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయాల్లో జరిగింది.. క్రిస్టియన్‌ పద్దతిలో జరిగినప్పుడు ధరించిన డ్రెస్సును బ్లాక్‌ కాక్‌టైల్‌ స్ట్రాప్‌లెస్‌ గౌనుగా మార్చేసింది.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles