ఆ సౌత్‌ డైరెక్టర్‌ తో సల్మాన్‌ సినిమా!

Monday, March 31, 2025

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘సికందర్’ ఈ నెల 30న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు ఏఎం.మురుగదాస్ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.

ఇదిలా ఉండగా, ఇప్పుడు సల్మాన్ తన నెక్స్ట్ మూవీపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి కూడా ఓ సౌత్ డైరెక్టర్‌కే సల్మాన్ ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు బీటౌన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఇటీవల సల్మాన్‌ను కలిసి ఓ స్టోరీలైన్ వినిపించాడట.

సల్మాన్‌కు స్టోరీలైన్ నచ్చడంతో ఆయనకు ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ‘అమరన్’ డైరెక్టర్‌కు ‘సికందర్’ ఛాన్స్ ఇస్తాడా.. అనేది వేచి చూడాలి. ఇక సికందర్ సినిమాలో సల్మాన్ సరసన అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles