సల్మాన్‌ ఖాన్‌-రజినీ కాంత్‌ క్రేజీ కాంబో!

Tuesday, January 21, 2025

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌, సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ కాంబోలో ఓ బిగ్గెస్ట్‌ మల్టీ స్టారర్‌ రాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. ఈ బిగ్గెస్ట్‌ మల్టీ స్టారర్‌ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. అట్లీ గతేడాది బాలీవుడ్‌ బాద్‌ షా షారూక్‌ ఖాన్‌ తో జవాన్ సినిమా తెరకెక్కించాడు.

జవాన్‌ సినిమా ఘన విజయాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే జవాన్ సినిమా తరువాత దర్శకుడు అట్లీ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్‌ షూటింగ్ పూర్తి కాగానే అట్లీ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.

అయితే రెమ్యూనరేషన్‌ కారణంగా ఆ సినిమా ఆగిపోయినట్లు సమాచారం. దీంతో అట్లీ బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ తో ఓ సినిమా ప్లాన్‌  చేసినట్లు సమాచారం. ఈ సినిమా తలైవా రజినీకాంత్ కూడా యాక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles