సల్మాన్‌,మురుగుదాస్‌ ట్రీట్‌ వాయిదా!

Friday, December 27, 2024

సల్మాన్‌,మురుగుదాస్‌ ట్రీట్‌ వాయిదా! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా రష్మిక హీరోయిన్ గా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్‌ ఏ ఆర్ మురుగదాస్ కాంబో లో చేస్తున్న భారీ సినిమా “సికందర్” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాపై భారీ హైప్ నెలకొనగా ఈ మూవీ గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సమయంలో మేకర్స్ సాలిడ్ టీజర్ కట్ ని విడుదల చేస్తున్నట్టుగా తాజాగా ప్రకటించారు. మరి ఈరోజే ఆ టీజర్ కూడా రావాల్సి ఉంది కానీ మేకర్స్ దానిని ఇపుడు వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. దీంతో ఈ టీజర్ ఈరోజు వాయిదా వేసి రేపటికి మళ్ళీ అదే సమయానికి ఫిక్స్‌ చేశారు. దీంతో ఈ టీజర్ రేపు డిసెంబర్ 28న ఉదయం 11 గంటల 7 నిమిషాలకే విడుదల చేయనున్నట్లుగా చెప్పారు. సో రేపటి వరకు భాయ్ ఎంట్రీ కోసం ఆగాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా సల్మాన్ స్నేహితుడు సాజిద్ నదియాద్వాల నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అలాగే వచ్చే ఏడాది ఈద్ కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles