మురగదాస్‌ తో సల్లూ భాయ్‌!

Andhrawatch
1 Min Read

రంజాన్‌ వస్తుంది అంటే.. కచ్చితంగా సల్మాన్‌ ఖాన్‌ సినిమా ఉంటుందని బాలీవుడ్‌ అభిమానులు ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి మాత్రం వారి ఆశల మీద నీళ్లు చల్లాడు సల్లూ భాయ్‌. ఈ ఏడాది ఏ సినిమా కూడా సల్మాన్‌ నుంచి రాలేదు. కానీ వచ్చే సంవత్సరం మాత్రం కచ్చితంగా తన నుంచి సినిమా వస్తుందని భాయ్‌ అనౌన్స్‌ చేశాడు.

నిజానికి చాలారోజుల నుంచి తమిళ్ స్టార్ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేయనున్నాడు అనే ప్రచారం జోరుగా సాగుతూ వస్తోంది. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సల్మాన్ ఖాన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. మురగదాస్ దర్శకత్వంలో తాను సికిందర్ అనే సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

చ్చే ఏడాది ఈద్ అదేనండి రంజాన్ కి వారి సినిమా విడుదల అవుతుందని  ప్రకటించారు.అంతే కాదు ఈ ఏడాది రంజాన్ ని బడే మియాన్ చోటా మియాన్ సినిమాతో పాటు మైదాన్ సినిమాతో జరుపుకోవాలని వచ్చే ఏడాది పండుగ మాత్రం తమ సికిందర్ సినిమాతో జరుపుకోవాలని ఆయన సోషల్‌ మీడియాలో   పోస్ట్ చేశాడు.

 ఇదిలా ఉంటే ఏఆర్ మురుగదాస్ హిందీలో ‘గజిని’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -
Share This Article