సలార్ రీరిలీజ్ క్రేజీ ఓపెనింగ్స్! పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. మరి అప్పట్లో రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం మళ్ళీ ఇపుడు ప్రాపర్ రీరిలీజ్ కి అది కూడా ప్రభాస్ బర్త్ డే లేకుండా వచ్చింది.
మరి ఈసారి మాత్రం క్రేజీ ఓపెనింగ్స్ ని మొదటి రోజు ఈ చిత్రం అందుకోవడం విశేషం. ఇలా సలార్ రీరిలీజ్ లో మొదటి 3.24 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో సలార్ మళ్ళీ అదరగొట్టింది అని చెప్పవచ్చు. మరి ఫుల్ రన్ లో సలార్ రీరిలీజ్ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే మేకర్స్ సలార్ పార్ట్ 2 ని కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.