మరో ప్రేమ కథలో నటిస్తున్న సాయి పల్లవి!

Wednesday, January 22, 2025

సాయి పల్లవి గత కొంతకాలంగా ప్రేమకథలకు కేరాఫ్‌ అడ్రస్‌ గా మారారు. ఇప్పటికే ప్రేమమ్, ఫిదా, లవ్ స్టోరీ సినిమాలతో అభిమానులను అలరించిన సాయి పల్లవి.. ప్రస్తుతం తెలుగులో ‘తండేల్‌’లో నాగ చైతన్యకు జోడిగా నటిస్తున్నారు. ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథని సమాచారం. ఈ క్రమంలోనే సాయి పల్లవి మరో ప్రేమ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇందులో రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ హీరో. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అందమైన ప్రేమ కథతో రూరల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం నాయికగా సాయి పల్లవిని ఫైనల్‌ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

ఇప్పటికే సాయి పల్లవితో చర్చలు పూర్తయ్యాయని, ఆమె నటించేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్లనుంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండేల్‌, తమిళంలో అమరన్‌లో సినిమాల్లో నటిస్తుంది. మరోవైపు హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు కూడా చేస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles