పూజా కార్యక్రమాలతో మొదలైన ఆర్టీ75 !

Andhrawatch
1 Min Read

మాస్ మహారాజ తన కెరీర్ లో 75 వ సినిమాని ఇటీవలే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాని  డెబ్యూ డైరెక్టర్‌ భాను భోగవరపు రూపొందిస్తున్నారు.  ఈ సినిమా నేడు ఘనంగా పూజా కార్యక్రమాలతో మొదలు అయ్యింది. హైదరాబాద్‌  లో జరిగిన ఈ ఈవెంట్‌లో రవితేజ, శ్రీలీల , నిర్మాత సూర్యదేవర నాగవంశీ, డైరెక్టర్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సినిమాలో శ్రీలీల మరోసారి రవితేజతో జోడి కడుతోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నటించిన ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌ అందుకుంది. సినిమాలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా సెట్‌ అయింది. దానికి తోడూ ఇద్దరూ మాస్ డ్యాన్స్ తో అదరగొట్టేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఈ జోడి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమాతో ధమాకా  మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.   ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Share This Article