విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. సినిమా స్టైల్, విజువల్స్ చూసినవాళ్లలో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది.
ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించినప్పటికీ, తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకి వచ్చింది. ఫుల్ షూటింగ్ పూర్తైన తర్వాత కూడా కొన్ని సీన్లు అనుకున్న స్థాయిలో లేవన్న ఫీలింగ్‌తో, మేకర్స్ ఇప్పుడు రీషూట్ చేస్తున్నారు. కొన్ని కీలక సీన్స్‌కి తగినట్లుగా మళ్లీ షూట్ చేస్తున్నట్టు సమాచారం. గోవాలో ప్రస్తుతం ఈ రీషూట్ జరుగుతుందని సినీ వర్గాల సమాచారం.
ఈ చిన్న ప్యాచ్ వర్క్ పూర్తైన తర్వాత ప్రమోషన్ పనులు ప్రారంభించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. విజయ్ ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని ఒక యూనిక్ లుక్‌లో కనిపించనున్నాడు. అతనికి జోడీగా భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ రెడీ అవుతున్నారు.
