టీజర్‌ అనౌన్స్మెంట్‌ తో రాబిన్‌ హుడ్‌!

Monday, January 20, 2025

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పోస్టర్స్ ఈ అంచనాలను పెంచేలా కనపడుతున్నాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు

‘రాబిన్‌హుడ్’ మూవీ టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే అనౌన్స్‌మెంట్‌ను నవంబర్ 12న ఉదయం 10.08 గంటలకు రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అడ్వెంచరస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధం కండి అంటూ ఓ పోస్టర్ ద్వారా ఈ టీజర్ అనౌన్స్‌మెంట్‌ను వెల్లడించారు.

ఇక ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జివి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. డిసెంబర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles