తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తు్న్న లేటెస్ట్ చిత్రం ‘రెట్రో’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షుకుల్లో ఈ మూవీపై అంచనాలను పెంచాయి.
అయితే, ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో వివరాలను చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ డే ఫస్ట్ షో మే 1న ఉదయం 9 గంటలకు ఇండియా వ్యాప్తంగా ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు కేరళలోని ఫస్ట్ డే ఫస్ట్ షో పై క్లారిటీ ఇస్తూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.