అకీరా విషయంలో పెద్ద ట్విస్ట్‌ ఇచ్చిన రేణు!

Wednesday, January 22, 2025

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, నటి రేణు దేశాయ్‌ ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. కానీ పిల్లల కోసం మాత్రం వారు కలుస్తూనే ఉంటున్నారు. ఇక పవన్‌ పిల్లలు అకీరా నందన్‌, ఆద్యల బాధ్యత రేణు తీసుకున్నప్పటికీ.. పండగలకు మాత్రం వారు మెగా ఫ్యామిలీతోనే ఉంటున్నారు.

తాజాగా రేణు సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసి పలు చిత్రాల్లో నటిస్తోంది. రేణు సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటూ వారి విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటు ఉంటుంది. ఇలా ఉంటే ఎవరైనా పిల్లల జోలికి వస్తే మాత్రం వారికి గట్టిగా సమాధానం ఇచ్చేస్తుంది. ఇక  అకీరా సినీ ఎంట్రీ గురించి నిత్యం సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు ఎదురవుతుండటంతో రేణు దేశాయ్ తన కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని చెప్పి అందరిని షాక్‌కు గురి చేసింది.

అయినప్పటికీ అకీరా ఇండస్ట్రీకి నటుడిగా రావాలని పవన్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల అకీరా నందన్ పుట్టిన రోజు కావడంతో రేణు 8 నెలల గర్భంతో ఉన్న వీడియో షేర్ చేసి స్పెషల్ విషెస్ కొడుకుకి తెలిపి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ తన ఇన్‌ స్టా ఖాతా  ద్వారా ఓ పోస్ట్ పెట్టి అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.

అకీరా తాజా ఫోటోలను రేణు షేర్ చేసింది. కానీ అందులో ఉన్న అకీరా  ఫ్రెండ్స్ అందరి ముఖాలు కనిపించకుండా చేసింది. ఇక ఇందులో అకీరా క్లీన్ షేవ్‌లో హ్యండ్సమ్‌ లుక్‌తో … అచ్చం పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ లా అదిరేలా ఉన్నాడు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles