విడుదలై 2 ఫస్ట్‌ లుక్‌ డేట్ అండ్‌ టైం ఫిక్స్‌!

Tuesday, January 21, 2025

కోలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ టర్న్డ్‌ హీరో సూరి హీరోగా చేసిన తన ఫస్ట్‌ మూవీ విడుదలై గురించి తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ మూవీలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించగా ఈ సినిమా తమిళ్ సహా తెలుగులో కూడా మంచి హిట్ అయ్యింది.

అయితే ఈ సినిమాకి రెండో భాగం “విడుదలై పార్ట్ 2” అయితే ఎప్పుడో రావాల్సింది కానీ కొద్దిగా ఆలస్యం అవుతూ వచ్చింది. మరి ఫైనల్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ కి ఇపుడు రంగం సిద్ధం అయ్యింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని  జులై 17 న విడుదల చేస్తున్నట్టుగా ఇప్పుడు చిత్ర బృందం కన్ఫర్మ్ చేశారు. అలాగే రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకి అయితే ఈ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నట్టుగా పేర్కొన్నారు.

మరి ఈ లుక్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. మరి రీసెంట్ గా కొన్నాళ్ల కితం విడుదలై 2 ని ఒక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ ప్రీమియర్ వేయగా దానికి అనూహ్య స్పందన వచ్చినట్టుగా చిత్ర బృందం వివరించింది. దీనితో ఈ సినిమా లేట్ అయినా కూడా మంచి అంచనాలు క్రియేట్‌ చేసుకుంది. ఇక ఈ సినిమాకి మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles