విడుదల తేదీ ఖరారు చేసుకున్న తంగలాన్‌

Thursday, December 26, 2024

త‌మిళ నటుడు చియాన్ విక్ర‌మ్ న‌టిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘తంగ‌లాన్’ ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ ప‌నులు ముగించుకుని విడుదల కు సిద్దంగా ఉంది. ఈ సినిమాను ద‌ర్శకుడు పా రంజిత్ డైరెక్ట్ చేస్తుండ‌టంతో కోలీవుడ్ తో పాటు సౌత్ ఇండ‌స్ట్రీల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక రొటీన్ కు భిన్నంగా ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్స్ ఉండ‌టంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులుఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చారు. ఈ పీరియాడిక్ ఎపిక్ డ్రామాను ఆగ‌స్టు 15న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ విడుదల చేస్తున్న‌ట్లు వారు ప్రకటించారు. ఈ సినిమాలో విక్ర‌మ్ ఓ ట్రైబ‌ల్ అవ‌తారంలో క‌నిపిస్తుండ‌టంతో ఈ సినిమాలో ఆయ‌న ఎలాంటి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చారా అనే ఆసక్తి అంద‌రిలో ఏర్పడింది.

ఇక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థ‌ల‌ను హ్యాండిల్ చేయ‌డంలో  పా రంజిత్ దిట్ట అనే సంగతి తెలిసిందే. తంగ‌లాన్ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటాడా అనే ఆస‌క్తి  అందరిలో క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో మాళ‌విక మోహ‌న‌న్, పార్వ‌తి తిరువొతు, ప‌శుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles