రీల్‌ అండ్‌ రియల్‌!

Tuesday, December 9, 2025

రీల్‌ అండ్‌ రియల్‌! మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆయన సందర్భానుసారంగా పోస్టులు పెడుతుంటారు. అయితే, మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చిరు, తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తన నిజజీవితం, సినీ జీవితంలో తన విజయానికి కారణమైన హీరోయిన్స్‌తో కలిసి చిరు ఓ ఫోటో దిగారు. ఈ ఫోటోలో చిరంజీవి రియల్ లైఫ్ హీరోయిన్, ఆయన సతీమణి సురేఖతో పాటు సినీ లైఫ్ హీరోయిన్లు రాధిక, నదియా, ఖుష్బూ, జయసుధ, మీనా, సుహాసిని, టబూ కనిపిస్తున్నారు. ఇలా తన జీవితంలో విజయానికి ఎంతో ముఖ్యమైన మహిళలతో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఫోటో దిగడం సంతోషంగా ఉందంటూ చిరు ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’’ అంటూ చిరు ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles