పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమాల్లో ఒకో దానిపై ఒకో రేంజ్ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఇపుడు మొదటిగా తన నుంచి విడుదలకి వస్తున్న సినిమా మాత్రం “హరిహర వీరమల్లు”. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం ఎపుడో రావాల్సింది అలా వాయిదాలు పడుతూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో వీరమల్లు సినిమా బిజినెస్ పై కొన్ని క్రేజీ రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే 140 కోట్ల మేర బిజినెస్ ని చేస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది. మెయిన్ గా ఒక్క ఆంధ్ర రాష్ట్ర బిజినెస్ నే 100 కోట్ల మేర ఉన్నట్టుగా టాక్. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంత ఆలస్యం అవుతూ వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అనేది అసలు ప్రశ్న అని చెప్పక తప్పదు. చాలా వరకు పవన్ అభిమానులే అంతగా ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సో వీటి అన్నిటిని దాటుకొని వీరమల్లు ఎంతవరకు రాబడతాడో అనేది వేచి చూడాల్సిందే.
