ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా సినిమా “మాస్ జాతర” గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రాన్ని మేకర్స్ ఆల్రెడీ ఈ మే నెలలో విడుదలకి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కానీ ఈ సినిమా డేట్ ని రవితేజ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కోసం త్యాగం చేయనున్నట్లు ఇపుడు రూమర్స్ వినపడుతున్నాయి. మెగాస్టార్ యాక్ట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “విశ్వంభర”ని మేకర్స్ మే 9కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది.. మెగాస్టార్ కి స్పెషల్ డేట్ ఇది కావున ఈ డేట్ లో వస్తే బాగుంటుంది అని భావించినట్టు రూమర్స్ వచ్చాయి.
మరి డేట్ లో ఆల్రెడీ మాస్ జాతర ఉంది కాని ఒకవేళ విశ్వంభర వస్తే రవితేజ తప్పుకొనున్నాడు అని ఇపుడు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇంకా క్లారిటీ లేదు.