పరుగులు పెడుతున్న మాస్‌ జాతర!

Friday, January 10, 2025

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాను భాను బోగవరపు డైరెక్ట్ చేస్తుండగా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలను అయితే క్రియేట్‌ చేసింది.

అయితే, ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం పరుగులు పెడుతుందని చెప్పుకొవచ్చు. ఈ సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని రవితేజ అనుకున్నాడంట. దీంతో ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే కూడా త్వరగా తెరకెక్కుతోందని చిత్ర వర్గాల్లో టాక్‌ వినపడుతుంది.

ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల మరోసారి రవితేజ సరసన హీరోయిన్‌గా మరోసారి నటిస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2025 మే 9న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles