మాస్ మహారాజ్ రవితేజ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ‘మాస్ జాతర’ సినిమాను రిలీజ్‌కి సిద్ధం చేస్తుండగా, అంతకంటే ముందే మరో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. ఈ సినిమా కోసం ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమలతో చేతులు కలిపారు. ఇది రవితేజ కెరీర్‌లో 76వ చిత్రం కావడం విశేషం.
ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా షూటింగ్‌కు స్టార్ట్ కూడా ఇచ్చేశారు. మొదటి షెడ్యూల్‌లోనే కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో రవితేజ తనకు బాగా చక్కగా సెట్ అయ్యే రోల్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.
ఇకపోతే, టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను కూడా త్వరలో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందిస్తుండగా, కథానాయికగా ఎవరు నటిస్తున్నారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఇలా చూడగా, రవితేజ మరో కమర్షియల్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు.
