నార్వేలో మాస్‌ మహారాజా!

Wednesday, January 15, 2025

మాస్ రాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లోని 75వ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ భాను భోగవరపు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘మాస్ జాతర’ అనే టైటిల్‌ను చిత్ర బృందం ఫిక్స్ చేసింది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.

అయితే, ఇటీవల రవితేజ చేతికి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆయన, ఇప్పుడు తిరిగి మాస్ జాతర షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. యూరప్‌లోని నార్వే ప్రాంతంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. మంచులో ఈ మూవీకి సంబంధించిన సీన్స్ తెరకెక్కిస్తున్నారు.

ఇక సెట్స్ నుంచి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం ఇస్తున్నాడు. నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles