లెజెండరీ యాక్టర్‌ని గుర్తుచేసిన రవితేజ!

Thursday, April 3, 2025

మాస్ రాజా రవితేజ నటించిన తాజా సినిమా ‘మిస్టర్ బచ్చన్’ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడంతో అభిమానులతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపిస్తోంది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు దానిని ఫాలో అవుతున్నారు.

అయితే, ఈ సినిమాలో రవితేజ ఓ లెజెండరీ యాక్టర్‌ను అభిమానులకు గుర్తుచేశాడు. టాలీవుడ్ దివంగత లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావుని రవితేజ ఇమిటేట్ చేయడం అభిమానులను ఒకింత సర్‌ప్రైజ్ చేసింది. ఓ సీన్‌లో సీనియర్ నటి అన్నపూర్ణ రవితేజను డ్యాన్స్ చేయమని కోరితే.. అక్కినేని క్లాసికల్ సాంగ్స్‌లో ఆయనను ఇమిటేట్ చేస్తూ రవితేజ డ్యాన్స్ ఇరగదీశాడు. దీంతో థియేటర్లలో అభిమానులు విజిల్స్ వేస్తూ రచ్చ రచ్చ చేశారు.ఈ సీన్ చూసిన అక్కినేని అభిమానులు కూడా థ్రిల్ అవుతున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles