పెళ్లి పై రాశీ కీలక వ్యాఖ్యలు!

Friday, December 5, 2025
టాలీవుడ్‌ లో ఊహాలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఖాళీ లేకుండా గడిపింది. నిజానికి ఆమె తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది. అలాగే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే హీరోగా చేస్తున్నారు.

నిజానికి రాశి ఖన్నా సినిమా పరిశ్రమకు వచ్చి చాలా కాలమే అయింది కానీ ఆమెకు వేరే హీరోలతో కానీ నటులతో కానీ అఫైర్స్ ఉన్నట్లు వార్తలు చాలా అరుదుగానే వినిపించాయి. అయితే తాజాగా ఆమె తన పెళ్లి గురించి ఓపెన్ కామెంట్లు చేసింది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఏబీపీ సౌత్ సమ్మెలో చేతన్ భగత్ ఆమె పెళ్లికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు.

దానికి ఆమె స్పందిస్తూ అది నా పర్సనల్ విషయం కాబట్టి ఇప్పుడు నేను దాని గురించి ప్రస్తావించాలనుకోవడం లేదని లేదని సున్నితంగా మాట దాటేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ నాకు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే ఉంది కానీ దానికి టైం ఉంది అది నా పర్సనల్ విషయం నా వృత్తితో దాన్ని కలపాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్పుకొచ్చింది. సబర్మతి రిపోర్టు సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో యాక్ట్‌ చేసింది. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు సందడి చేయబోతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles