జై హనూమాన్‌ కోసం రంగంలోకి రానా!

Wednesday, January 22, 2025

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ గతంలోనే వెల్లడించాడు.

 ఇక ఈ సినిమాకు ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అయితే, తాజాగా ఈ సినిమా నుండి వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాడు.

ఇటీవల ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు ప్రకటించాడు యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ. దీంతో ఈ సినిమా ఎఫ్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మరో స్టార్ రానా దగ్గుబాటి కూడా కనిపించబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ప్రకటించి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.  ఈ క్రమంలో రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ, రానా దగ్గుబాటిలు కలిసి ఉన్న ఫోటోను ప్రశాంత్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

దీంతో ఈ సినిమాలో రానా దగ్గుబాటి ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి వీలైనంత త్వరగా సినిమాను ముగించాలని మూవీ మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు  భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles