నువ్వంటే చాలే అంటున్న రామ్‌!

Wednesday, December 10, 2025

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా షూటింగ్ చివరి దశలో ఉంది. ఫైనల్ షెడ్యూల్‌ను త్వరగా పూర్తిచేయడానికి చిత్రబృందం వేగంగా పనులు జరుపుతోంది. ఈ సినిమాను దర్శకుడు పి. మహేష్ కుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. రామ్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సిద్దమవుతున్నాడు.

ఇటీవల ఈ మూవీ నుండి మొదటి సింగిల్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇది పూర్తిగా రొమాంటిక్ ఫీలింగ్ కలిగించే సాంగ్‌గా ఉండబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్-మెర్విన్ అందమైన ట్యూన్ ఇచ్చారు. ఈ పాటకు ప్రత్యేకత ఏమిటంటే లిరిక్స్‌ను రామ్ స్వయంగా రాసాడు. అనిరుధ్ రవిచందర్ తన వాయిస్‌తో ఈ సాంగ్‌కు మరింత మేజిక్ జోడించాడు. ప్రోమోనే ప్రేక్షకుల్లో కుతూహలం రేపింది. అందరూ ఇప్పుడు ఫుల్ సాంగ్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రంలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇంకా ఎక్కువ హైప్ తెచ్చే అప్‌డేట్స్ రాబోతున్నాయని సమాచారం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles