మళ్లీ చెన్నైకి రామ్‌ చరణ్‌!

Andhrawatch
1 Min Read

పాన్‌ ఇండియా స్టార్ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ డైరెక్షన్‌ లో గేమ్‌ చేంజర్‌ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్‌ థ్రిల్లర్‌ యాక్షన్‌ సీక్వెన్స్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాని మొదలు పెట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుంచి ఈ సినిమాను శంకర్ చెక్కుతూనే ఉన్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.. ఇప్పటికి చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుందని గత కొన్ని రోజులుగా మేకర్స్ చెబుతున్నారు.

జరగండి..జరగండి పాట తర్వాత చిత్ర బృందం మరో అప్డేట్ ను ప్రకటించలేదు..తాజాగా చరణ్ చైన్నైకి వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో  రామ్ చరణ్ కనిపించారు. గేమ్ ఛేంజర్ సినిమా రెండు రోజుల షూటింగ్ కోసం చరణ్ చెన్నైకి వెళ్లారు. ఇక సినిమా త్వరలోనే విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

మరోవైపు దిల్ రాజు మాత్రం దసరాకు సినిమాను రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నామంటూ ఇటీవల ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే సినిమా ఇప్పటిలో వచ్చేలా లేదు. రామ్ చరణ్ తొలిసారి పొలిటికల్ డ్రామా సినిమాను చేస్తున్నారు.. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ ఇలా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. 

Share This Article