త్వరలో సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న రకుల్‌ ..అందుకేనా!

Wednesday, December 18, 2024

టాలీవుడ్ లోకి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ. తక్కువ కాలంలో స్టార్‌ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. వరుస బ్లాక్‌ బస్టర్‌ హిట్లను ఖాతాలో వేసుకుంటూ స్టార్‌ హీరోయిన్ గా మారిపోయింది.  చాలా కాలం పాటు తెలుగులో తన హవా కొనసాగించిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్ చెక్కేసి అక్కడ కూడా తన అందం, నటనతో మాయచేసింది.

ఆ క్రమంలోనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానిని ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని,  భర్త, కుటుంబంతో  చాలా సంతోషంగా గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ గా మారింది. అది ఏంటంటే.. ఈ ముద్దుగుమ్మ త్వరలోనే సినీ ప్రపంచానికి బై బై చెప్పేస్తుందంట…

 ఎందుకంటే ఆమె ఇప్పటికే చాలా బిజినెస్‌లు రన్ చేస్తోంది. అంతే కాకుండా తాజాగా హైదరాబాద్‌లో కొత్త బిజినెస్ మొదలు పెట్టింది. దీంతో ఈ బ్యూటీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి, బిజినెస్ చూసుకోనుంది అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, ఇందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles